కరోనా అప్డేట్: ఏపీలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, January 18th, 2021, 09:10:33 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 27,861 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 81 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా బారిన నేడు మరొకరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,066 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,713 మంది చికిత్స పొందుతుండగా 8,77,212 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 263 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,141 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,26,04,214 శాంపిల్స్ పరీక్షించారు.