భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు..!

Saturday, April 3rd, 2021, 03:58:48 PM IST


భారత్‌లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడమే కాకుండా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 89,129 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 714 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 6,58,909 యాక్టివ్ కేసులు ఉండగా, 1,15,69,241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,64,110 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 44,202 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 93.4 శాతం ఉండగా, మరణాల రేటు 1.3 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.