ఏపీలో కరోనా బీభత్సం.. నేడు భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!

Tuesday, April 20th, 2021, 08:00:37 PM IST

ఏపీలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 37,922 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 35 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,76,987కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 53,889 మంది చికిత్స పొందుతుండగా 9,15,626 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 3,116 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,472కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,57,53,679 శాంపిల్స్ పరీక్షించారు.