ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు.. మరొకరు మృతి..!

Friday, January 15th, 2021, 05:34:45 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,696 శాంపిల్స్‌ని పరీక్షించగా 94 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన నేడు మరొకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,710 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,199 మంది చికిత్స పొందుతుండగా 8,76,372 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 232 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,139 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,14,639 శాంపిల్స్ పరీక్షించారు.