షాక్ .. అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ?

Friday, June 15th, 2018, 01:12:13 PM IST

తాజాగా అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ తీవ్ర సంచలనం రేపుతోంది. అమెరికాలో చెరిగిన తెలుగు నటీమణుల సెక్స్ స్కాం లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తుండడంతో అందరు షాక్ అవుతున్నారు. వర్ధమాన తారలను. టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ వారిని విసిటింగ్ వీసాలపై అమెరికా రప్పించి పలు ప్రాంతాల్లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్టు వెల్లడయింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కిషన్ అయన భార్య చంద్ర లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి వ్యవవహారం పై చికాగో కోర్ట్ లో 42 పేజీల ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. తాజాగా డిసెంబర్ 2017 లో అమెరికా వెళ్లివచ్చిన ఓ నటి .. కిషన్ ను వేడుకుంటూ ఓ మెయిల్ పంపింది .. ఇప్పుడు ఆ మెయిల్ చుసిన పోలీసులు ఆమెను విక్టిమ్ ఏ గా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇంతకీ ఆమె రాసిన లేఖలో ఏమున్నదంటే .. దయచేసి ఇకపై నాకు ఫోన్ చేయకండి, నేను కూడా మిమ్మల్ని కలవాలని ప్రయత్నించను, మీతో కలిసి వ్యాపారం చేయడం ఇబ్బందిగా ఉందని, మళ్ళీ ఈ విషయంలో తనను కాంటాక్ట్ చేస్తే పోలీసులుకు పిర్యాదు చేస్తానని పేర్కొంది. దాంతో కిషన్ ఆమెను ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ వ్యవహారానికి సంబందించిన పలు కీలక విషయాలు కిషన్ దగ్గర పోలీసులు రాబట్టారట. మరి ఈ సెక్స్ రాకెట్ ఎలాంటి దుమారం రేపుతోంది చూడాలి.