చీపురు పట్టిన ప్రముఖ నటి త్రిష!

Wednesday, December 3rd, 2014, 02:29:32 PM IST


ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన స్వచ్చ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రముఖులెందరో పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ వ్యాపారస్తుల నుండి సినీతారల వరకు అందరూ స్వచ్చందంగా పాల్గొని స్వచ్చ్ భారత్ ను విజయవంతం చేస్తున్నారు. ఈ నేపధ్యంగా ఇటీవల ప్రముఖ టాలివుడ్ నటి సమంతా స్వచ్చ్ భారత్ లో పాల్గొని మరో టాలివుడ్ హీరోయిన్ త్రిష ను నామినేట్ చేసింది. ఇక సమంతా చాలెంజ్ ను స్వీకరించిన త్రిష బుధవారం చెన్నైలో తాంబరం సమీపంలోని ముదిచుర్ లో ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(ఈఎఫ్ఐ)కు చెందిన యానిమల్ హోంలో చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత అన్నది అందరికీ ముఖ్యమని వివరించారు. అలాగే స్వచ్చ్ భారత్ కార్యక్రమానికి తనకు సహకరించిన అందరికీ త్రిష ధన్యవాదాలు తెలిపారు.