కరోనా అనేక రకాల అనుభవాలు నేర్పింది – ఈటెల రాజేందర్

Tuesday, March 2nd, 2021, 12:11:57 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయి నేటికీ ఏడాది అయింది. అయితే ఈ మహమ్మారి సోకిన తొలి కరోనా బాధితుడు, ఆరోగ్య సిబ్బంది తో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి లో వైద్య సిబ్బంది కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు క్లిష్ట సమయంలో సేవలు అందించిన వారిని కొనియాడారు.

కరోనా అనేక రకాల అనుభవాలు నేర్పింది అని, కరోనా వైరస్ సోకి ప్రజలు ఎందుకు చనిపోయారో కారణాలను వైద్యులు గుర్తించాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే హెచ్ఐవి వంటి వైరస్ మాదిరి గా కరోనా తో కూడా కలిసి జీవించాల్సిన పరిస్థతి ఉంటుంది అని మంత్రి తెలిపారు. అందువల్ల భవిష్యత్ లో కరోనా వైరస్ సోకకుండా, ఒక వేళ సోకినా దాని నుండి బయటపడే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడానికి వైద్యులు అందరూ కూడా మేధో మథనం చేయాలని సూచించారు.అయితే కరోనా వైరస్ మహమ్మారి క్లిష్ట సమయాల్లో తోడుగా ఉన్న వైద్యులను ఎంత అభినందించినా తక్కువే అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయంగా మారాయి.