దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధి – కేటీఆర్

Friday, April 2nd, 2021, 04:17:56 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లు చేశారు మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా లోని రెండవ ఐటీ హబ్ భూమి పూజ చేశారు. టేకులపల్లి లోని రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. ఖమ్మం లోని నూతనం గా ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం ఆర్టీసి బస్టాండ్ ను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్రం లోని హైదరాబాద్ కి దీటుగా ద్వితీయ శ్రేణి నగరాలను తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. భారత దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధి చెందుతుంది అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే హైదరాబాద్ కి మాత్రమే ఐటి రంగాన్ని పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.