అదనపు ఖర్చును కేంద్రం పీఎం కేర్స్ నిధి భరించలేదా? – మంత్రి కేటీఆర్

Thursday, April 22nd, 2021, 02:50:40 PM IST


భారత్ దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోవిషీల్డ్ టీకా ధరలను పూణే లోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కి 150 రూపాయలకు వాక్సిన్ ను ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలు గా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా ఈ విషయం పట్ల తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఒకే దేశం లో ఇప్పుడు వాక్సిన్ కి రెండు ధరలు చూస్తున్నాం అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు 400 రూపాయలు అంటున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే అదనపు ఖర్చును కేంద్రం పీఎం కేర్స్ నిధి భరించలేదా అంటూ మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. అయితే దేశమంతా వాక్సినేషన్ పూర్తి కి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే ఒకే దేశం ఒకే పన్ను కోసం జీఎస్టీ ను అంగీకరించాము అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.