మంత్రి కేటీఆర్ కి కరోనా వైరస్ పాజిటివ్

Friday, April 23rd, 2021, 10:15:40 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో రాష్ట్రం లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజా గా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేశన్ లో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయి అని తెలిపారు. అయితే తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు అంతా కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని వ్యాఖ్యానించారు.