నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు సర్వీసులపై టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం..!

Wednesday, April 21st, 2021, 01:00:20 AM IST

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ రోజు నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేప‌థ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సు స‌ర్వీసుల‌పై క్లారిటీ ఇచ్చింది. నైట్ కర్ఫ్యూ ఉన్నా ఆర్టీసీ బస్సులు యథాతథంగా న‌డుస్తాయ‌ని తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగి స్ప‌ష్టం చేశారు. అయితే రాత్రి 10 గంటలలోపు అన్ని బస్సులు డిపోల‌కు చేరుకుంటాయ‌ని, ఆర్టీసీ బ‌స్సు టికెట్లు చూపించి ప్రయాణికులు తమ తమ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చని సూచించారు. ప్రయాణికులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదిలా ఉంటే నైట్ కర్ఫ్యూ నేపధ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైలు కూడా స‌ర్వీసుల స‌మ‌యాన్ని కుదించింది. ఇకపై చివ‌రి స్టేష‌న్ నుంచి రాత్రి 7:45 గంట‌ల వ‌ర‌కే చివ‌రి మెట్రో రైలు అందుబాటులో ఉండ‌నుంది. రాత్రి 8:45 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్‌కు మెట్రో రైలు చేరుకోనుంది. ఈ మార్పులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.