బిగ్ న్యూస్: భూములు అన్యాక్రాంతం కాకుడదనేదే మా ఉద్దేశ్యం – వైవి సుబ్బారెడ్డి

Monday, May 25th, 2020, 08:10:14 PM IST

శ్రీవారి ఆస్తుల విషయంలో ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ భూములు అమ్మాలి అంటే కోటి 53 లక్షల విలువైన భూములు అమ్మాల అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నో విలువైన భూములను అమ్మేసింది అని, రాజకీయ వ్యతిరేకత తోనే మా పై దుష్ప్రచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి నీ చాలా బాధ్యతగా ఖర్చు చేస్తాం అని, టీటీడీ ఆస్తులను కాపాడటమే మా ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ అమ్మకాలు ఇపుడు కొత్తేం కాదు అని అన్నారు.

గత చైర్మన్ కృష్ణమూర్తి భూములు అమ్మాలి అని తీర్మానం చేశారు అని, అంతేకాక అవి తిరుపతికి దూరం గా ఉన్నాయి అని కారణం చూపారు అని వ్యాఖ్యానించారు.అయితే వేలానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని అన్నారు.అక్కడి పరిస్తితల పై నివేదిక వచ్చిన అనంతరం బోర్డు లో నిర్ణయం తీసుకుందాం అని అనుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే రాద్దాంతం చేస్తున్నారు అని అన్నారు. అయితే పాత తీర్మానం పై సమీక్ష నిర్వహించాం అని వ్యాఖ్యానించారు.ఆస్తుల అమ్మకం కాకుండా, పెద్దల, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటాం అని అన్నారు.భూముల అన్యాక్రాంతం కాకూడదు అనేదే మా ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించారు.