కేసీఆర్ కూల్ గా పండగ చేస్తే.. చంద్రబాబు కసిగా చేశారు

Thursday, June 2nd, 2016, 04:35:04 PM IST


ఈరోజు జూన్ 2న రెండు తెలుగు రాష్ట్రాలైన సీమాంధ్ర, తెలంగాణాలు వివిపోయి కొత్తగా ఏర్పడ్డ దినం. అనగా ఈరోజే రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు. దినోత్సవాలు ఒకటే అయినా వాటిని నిర్వహించిన విధానంలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించి సాదించిన విజయాలను గుర్తు చేసుకుని చెయ్యవలసిన పనులకు పథకాలు సిద్దం చసుకుని చాలా కూల్ గా పండగ నిర్వహించారు. ఏకంగా దేశంలోనే ఎత్తైన 303 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి రొమ్ము విరుచుకుని నిలబడ్డారు.

కానీ ఏపీలో మాత్రం ఆవిర్భావ దినోత్సవం చాలా గంభీర వాతావరణం మధ్య జరిగింది. విభజన వల్ల జరిగిన నష్టం, చెయ్యల్సిన బృహత్కార్యాలు మిగిలిఉండటం, ఒక్కో ఇటుకా పేర్చి ఇళ్ళు కట్టినట్టు రాజధానిని పునాదుల నుండి నిర్మించాల్సి ఉండటం, కేంద్ర సహకారాన్ని సాదించడం వంటి లక్ష్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది సంబరాల సమయం కాదు సమరం చెయ్యాల్సిన సమయం అన్నట్టు గంభీరంగా విజయవాడలో ఏపీ నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టి నేతలు, అధికారులు, ప్రజలందరి చేతా ప్రతిజ్ఞ చేయించి కార్య నిర్వహణలోకి దిగారు.