జగన్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎందుకోసమంటే?

Friday, April 23rd, 2021, 02:25:50 AM IST

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా రోజుకు వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆస్ప‌త్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగిపోతోంది. చాలా రాష్ట్రాల్లో కరోనా పేషంట్లకు వెంటిలేటర్లు ఉపయోగించాల్సిన అత్యవసర పరిస్థుతులు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వం నాగ్‌పూర్‌కు వారం రోజుల్లో 300 వెంటిలేట‌ర్ల‌ను పంపించింది. విశాఖ‌లోని మెడ్ టెక్ జోన్ ద్వారా ఈ వెంటిలేట‌ర్ల‌ను నాగ్‌పూర్‌కు పంపిణీ చేసింది. ఈ క్రమంలో నేడు ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డికి ఫోన్ చేసిన కేంత్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఏపీ ప్రభుత్వ సాయానికి అభినందనలు తెలియచేశారు.