బిగ్ బికి యూఎస్ కోర్ట్ సమన్లు

Tuesday, October 28th, 2014, 02:51:44 PM IST


బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు యూఎస్ కోర్ట్ సమన్లు జారీ చేసింది. 1984లో ఇందిరాగాంధీ హత్యతరువాత జరిగిన అల్లర్లలో ప్రజలను హించకు ప్రేరేపించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని న్యూయార్క్ లోని సిక్కు ఫర్ జస్టిస్ ఆరోపించింది. యూఎస్ కోర్ట్ జారీ చేసిన సమన్లపై 21రోజులలోగా సమాధానం చెప్పాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 1984 ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులపై జరిగిన ఊచకోతల వెనుక పలువురు కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నట్టు సిక్కు ఫర్ జస్టిస్ ఎన్నో సంవత్సరాలుగా ఆరోపిస్తున్నది. తాజాగా ఈ అల్లరలో సంభందం ఉన్న వారికి యూఎస్ కోర్ట్ సమన్లు జారీ చేసింది.