ఫ్లాష్ న్యూస్ : అమెరికాలో తెలుగు విద్యార్థులకు షాకిచ్చిన యూఎస్ పోలీసులు!

Tuesday, November 12th, 2019, 03:00:35 PM IST

ప్రపంచంలోనే అగ్ర రాజ్యాంగా పేరుగాంచిన అమెరికాలో భారతదేశం నుంచి అందులోనూ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నివసించే వారు అధికంగానే ఉన్నారు.అందులోను పై చదువుల కోసం యువత యూఎస్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.ఈ నేపథ్యంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ యూఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఉంటూ ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటివి చేసి అక్కడ వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.ఇప్పుడు ఇలాంటి అంశమే ఒకటి బయటకు వచ్చింది.అమెరికాలోని ఎలాంటి అనుమతులు కూడా లేకుండా అక్రమంగా ఉంటున్నటువంటి కొంతమంది భారతీయులను అందులోను తెలుగువారినే అక్కడి పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా మొత్తం ఎనిమిది మంది అక్రమంగా యూఎస్ లో ఉంటూ ఫార్మింగ్ టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారని వారిలో మొత్తం ఆరుగురిని ఇప్పుడు పట్టుకొని జైల్లో పెట్టారని కూడా సమాచారం.భరత్ కాకిరెడ్డి,సంతోష్ శర్మ,అవినాష్,సురేష్ కందాల,నవీన్ ప్రత్తిపాటి మరియు అశ్వంత్ లను అదుపులోకి తీసుకొని ఏడాదికి తక్కువ లేకుండా శిక్షలు విధించారు. మిగతా ఇద్దరినీ కూడా అతి త్వరలోనే పట్టుకొని వారికి కూడా శిక్ష విధించేలా చేస్తామని ఐసీఈ(ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) వారు స్పష్టం చేసారు.