బీఫ్ పై దేశంలో మంటపుట్టిస్తున్నది..!

Friday, November 20th, 2015, 03:25:27 PM IST


బీఫ్ వివాదం దేశంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గోవులను హిందువులు పూజిస్తారని.. కాబట్టి వాటిని చంపి తినేందుకు వీలులేదని అంటూ.. దేశవ్యాప్తంగా బీఫ్ ను బ్యాన్ చేయాలని కొంతమంది రాజకీయనాయకులు, కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బీఫ్ వాడకాన్ని నిషేదించారు. జమ్మూ కాశ్మీర్ వంటి ముస్లింలు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో సైతం బీఫ్ ను బ్యాన్ చేయడంతో.. వివాదం మరింత ముదిరింది. బీఫ్ తిన్నరనే నెపంతో.. కొంతమందిని హిందూ చాందసవాదులు చంపేశారు కూడా. బీహార్ లో ఎన్డీఏ ఓడిపోవడానికి ముఖ్యకారణం బీఫ్ వివదమనే చెప్పాలి.

ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గోమాంసంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గోవులను చంపితినడాన్ని నిషేదించాలని అన్నారు. ఇక గోవులను చంపిన వారు ఏ మతానికి చెందిన వారైనా సరే వారు భారతదేశానికి పెద్ద శతృవులని అన్నారు. గోవులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. బీఫ్ ను నిషేదించాలని అంటూ.. ఇటీవల కాలంలో ఎన్డీఏ చేపడుతున్న చర్యలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మార్చ్ నిర్వహించింది. అటువంటి తరుణంలో ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై.. ఆ పార్టీ హైకమాండ్ ఏవిధంగా స్పందిస్తుందో మరి.