రాజకీయాల్లోకి వస్తానన్న స్టార్ కమెడియన్!

Friday, May 15th, 2015, 09:56:54 AM IST


తమిళ చిత్రసీమలో సీనియర్ హాస్యనటుడు వడివేలు తాను రాజకీయాలలోకి వస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా హీరోగా నటించిన ‘ఎలి’ (ఎలుక) చిత్రం యాప్ ను చెన్నైలో ఆవిష్కరించిన వడివేలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. కాగా గతంలో అన్నా డీఎంకే పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారం చేసి అనంతరం కెరీర్ లో కొన్ని చిక్కులు తెచ్చుకున్న వడివేలు ‘తెనాలి రామన్’ అనే చిత్రంలో నటించగా అ చిత్రం పలు విమర్శల మధ్య మిశ్రమ స్పందనను దక్కించుకుంది.

ఇక తాజాగా నటించిన ‘ఎలి’ చిత్రంలో తాను ఎలుకగా నటిస్తున్నానని, ఎలుక ఏమేమి పనులు చేస్తుందో అవన్నీ కూడా తాను ఈ చిత్రంలో చేస్తానని వడివేలు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో సదా కధానాయికగా నటిస్తోందని, అయితే ఆమెతో తాను డ్యూయెట్లు పాడలేదని తెలిపారు. ఇక ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉంటుందని వడివేలు చెప్పుకొచ్చారు.