పవన్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా సత్యమేవ జయతే సాంగ్..!

Wednesday, March 3rd, 2021, 07:32:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. కాగా గత ఏడాది మార్చ్‌లో ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా నుంచి మగువ మగువ తొలి పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి నేడు రెండో పాట విడుదలైంది.

అయితే సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, లెజెండ్‌ సింగర్‌ శంకర్‌ మహాదేవన్‌తో కలిసి పృథ్వీచంద్ర పాడాడు. థమన్‌ చక్కటి మ్యూజిక్ అందించాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా ఈ పాట ఉండడం, లిరిక్స్ కూడా అదిరిపోవడంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.