పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించినప్పటికి అది కాస్త వాయిదా పడడంతో, సంక్రాంతి రోజు టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే చెప్పినట్టుగానే, చెప్పిన టైమ్ కి వకీల్ సాబ్ టీజర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు అసలు సిసలు సంక్రాంతి ట్రీట్ అందించింది చిత్ర యూనిట్. టీజర్ చూసినట్టైతే లాయర్ కోటులో పవన్ కళ్యాణ్ లా పుస్తకాలను మూసి ఉంచిన కవర్‌ను తొలగించడం, సీరియస్‌గా పెన్ను నొక్కుతూ, వాచ్ చేతిలో పట్టుకుని కోర్టులో అబ్జక్షన్ యువరానర్ అంటూ డైలాగ్ చెప్పడం, అలాగే కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ మెట్రో ట్రైన్లో రౌడీలను చితకబాదడం వంటి మాస్ సన్నివేశాలతో పాటు చివరలో తన లగేజీతో పవన్ బుక్ చదువుతూ ట్రక్‌లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది. అయితే టీజర్ పక్కా మాస్ అభిమానులను, పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉండడంతో రికార్డులు తిరగరాయడం పక్కాగా కనిపిస్తుంది.