జనసేన అధ్యక్షుడు పవన్ ఫ్యాన్స్.. కడప యూత్ ఆఫ్ పవనిజం ఆధ్వర్యంలో కడప తెలుగుదేశం పార్టీనేత దుర్గాప్రసాద్ 2016 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా సమానమే అనే అర్ధం వచ్చేలా క్యాలెండర్ ను పవనిజం యూత్ సభ్యులు తయారు చేయించారు. ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. 2015 లో చేసిన విధంగానే 2016లో కూడా పవనిజం సభ్యులు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే, ప్రకృతివైపరిత్యాల వలన సర్వంకోల్పోయిన వారికి పవన్ ఫ్యాన్స్ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.
ఇకపోతే, 2014 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరిందని.. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధ్యక్షుడిని వదులుకోడని.. దుర్గాప్రసాద్ తెలిపారు.