కరోనా టీకా రెండో డోస్ వేయించుకున్న ఉప రాష్ట్రపతి

Sunday, April 4th, 2021, 01:38:36 PM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో విలయ తాండవం చేస్తోంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మొదటి డోస్ తీసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు రెండవ డోస్ వేయించుకున్నారు. ఢిల్లీ లోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు టీకా వేశారు. అయితే మొదటి డోస్ చెన్నై లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కరోనా వైరస్ మరణాల తో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు.