ఇలాగే పోరాడుతూ రాష్ట్రాన్ని నడిపించాలని కోరుతున్నా – విజయ్

Wednesday, February 17th, 2021, 07:32:26 PM IST

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నీటి కోసం, విద్యుత్ కోసం, పచ్చదనం కోసం, అభివృద్ధి కోసం ఎంతో పోరాడారు అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మీరు ఆరోగ్యం తో అంటూ మాకోసం ఇలాగే పోరాడుతూ రాష్ట్రాన్ని నడిపించాలని కోరుతున్నా అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు చోట్ల తెరాస నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు.