ఒకేసారి 10వేల మందికి ఉద్యోగలిచ్చిన జగన్.. బాబు అలా ఇచ్చాడా.?

Saturday, July 4th, 2020, 08:08:11 AM IST

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున కరోనా కేసులు వస్తున్నాయి. అందుకు కారణం అంతే స్థాయిలో పరీక్షలు నిర్వహించడం అయితే ఆ పరీక్షలు నిర్వహించడానికి వైధ్యులు మరియు ఇతర సిబ్బంది కావాలి కదా? అందుకే అలాంటి వారి అందరి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేసారి 10 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం రేపారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పొద్దున్నే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 10 వేల కొత్త ఉద్యోగాల భర్తీతో అదనపు బలం చేకూర్చారని కానీ గత ప్రభుత్వం మాత్రం ఇలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యం అయ్యాయి అని నిమర్శించారు.