టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏప్రిల్ ఫస్టే కాదు.. జీవితమంతా ఫూల్ అవుతూనే ఉంటాడు మాలోకం అని, పాపం మ్యానుఫాక్చరింగ్ ఫాల్ట్ అది అని రిపేరు చేయడం పచ్చ పార్టీ మేధావుల వల్ల కాలేదు. గ్రేట్ మేనిప్యులేటర్ చంద్రం సారు కూడా చేతులెత్తేశాడు. అందుకే చినబాబు కామెడీకి కొదవ లేకుండా పోయిందని అన్నారు.
ఇక అంతకు ముందు వ్యాపారంలో నష్టమొచ్చి దుకాణం మూసే ముందు సరుకులను 90% డిస్కౌంటుకు ఆఫర్ చేస్తుంటారని, దానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే ఫ్రీగా వదిలించుకుంటాడు యజమాని అని, చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే ఉందని, ప్రజా క్షేత్రంలో తిరస్కృతిడిగా మిగిలి, పరిషత్ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నాడని అందుకే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని విజయసాయి రెడ్డి అన్నారు.
ఏప్రిల్ ఫస్టే కాదు. జీవితమంతా ఫూల్ అవుతూనే ఉంటాడు మాలోకం. పాపం మ్యానుఫాక్చరింగ్ ఫాల్ట్ అది. రిపేరు చేయడం పచ్చ పార్టీ మేధావుల వల్ల కాలేదు. గ్రేట్ మేనిప్యులేటర్ చంద్రం సారు కూడా చేతులెత్తేశాడు. అందుకే చినబాబు కామెడీకి కొదవ లేకుండా పోయింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 2, 2021