ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు ఇవే – విజయసాయి రెడ్డి

Saturday, April 3rd, 2021, 05:42:27 PM IST

ఏపీలో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అల్టీమేట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా.. లేదా ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా అని ప్రశ్నించారు. లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా.. లేక లోకేశ్‌ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందా అని ఎద్దేవా చేశారు.

అయితే టీడీపీ పార్టీని ఉద్దేశించి ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు ఇవేనంటూ ఐదు అంశాలను ప్రస్తావించాడు. వరుస ఓటములతో నాయకత్వంపై క్యాడర్‌కు నమ్మకం పోతుందని, శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయని, పోటీకి అభ్యర్థులు దొరకరు అని, ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుందని చివరగా ఖేల్ ఖతం. దుకాణం బంద్ అంటూ చెప్పుకొచ్చారు.