గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న సర్జికల్ స్ట్రయిక్ చుట్టూ నడిచిన ప్రచారం, నేడు ఒక్కసారిగా పీవీ, ఎన్టీఆర్ సమాధుల వైపు వెళ్ళిపోయింది. ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని అన్నారు. అక్రమ కట్టడాలను కూల్చడం కాదు దమ్ముంటే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని డిమాండ్ చేశాడు. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చి చూడు క్షణాల్లో నీ దారుసల్లాం నేలమట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
అయితే తాజాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన విజయశాంతి స్మూత్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో ఫ్వ్ ఘాట్, ణ్టృ ఘాట్లు కూల్చమని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజల Fట్ళ్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని, ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్ కూల్చాలని కూడా అనవచ్చు అని ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
@bandisanjay_bjp @kishanreddybjp @Arvindharmapuri @TS4BJP
అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో PV ఘాట్, NTR ఘాట్లు కూల్చమని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజల FTL వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని… ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్ కూల్చాలని కూడా అనవచ్చు.— VijayashanthiOfficial (@vijayashanthi_m) November 25, 2020