కరోనా వాక్సిన్ తీసుకున్న విజయశాంతి ఏమన్నరాంటే?

Friday, April 2nd, 2021, 12:20:41 AM IST

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఈ మేరకు నేటి నుండి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా వాక్సిన్ అందుబాటులో కి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మనందరినీ హెచ్చరిస్తున్నాయి అని విజయశాంతి పేర్కొన్నారు. కోవిడ్ వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలందరూ కూడా భయాందోళన వీడి ముందుకు రావలసిన అవసరం ఉందని, ఈరోజే తను వాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే వాక్సిన్ తీసుకోవడం వలన రెండు రకాలుగా మేలు జరుగుతుంది అని అన్నారు.

ఒకటి మనం కోవిడ్ నుండి రక్షణ పొందుతాం అని, మరొకటి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతాం అని అన్నారు. అందువల్ల సందేహాలు విడిచి ధైర్యంగా వాక్సిన్ తీసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక కరోనా వైరస్ నిబంధనలను పాటించడం ద్వారా ఇతరులకు కూడా మేలు చేసిన వారం అవుతాం అని వ్యాఖ్యానించారు.