బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కిడ్నాప్ కేసులో విజయవాడకు చెందిన సిద్దార్ధ కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌కి సిద్దార్థ్ మనుషులను సరఫరా చేసినట్టు తెలుస్తుంది. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్ గార్డ్‌గా ఉంటున్న సిద్దార్థ్ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తుంటాడు. కిడ్నాప్ గురుంచి భార్గవ్ సిద్దార్థ్‌కి చెప్పడంతో 15 మందితో హైదరాబాద్ వచ్చిన సిద్దార్థ అండ్ గ్యాంగ్ పక్కా ప్లాన్‌గానే కిడ్నాప్‌కి పాల్పడ్డారు. ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్‌లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఇక ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీ నిన్న ముగిసింది. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఖిలప్రియను మళ్ళీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.