విరాట్ వీరాభిమానికి బెయిల్ మంజూరు చేసిన పాక్ కోర్ట్..!

Saturday, February 27th, 2016, 12:58:51 PM IST


ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టి 20 మ్యాచ్ లలో ఇండియా ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. అయితే, మూడో మ్యాచ్ లో విరాట్ కోహ్లి 90 పరుగులు చేసి ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి దూసుకుడుగా ఆడటంతో ఆయన అభిమాని ఉమెర్ డజార్ ఇండియా ఫ్లాగ్ ను తన ఇంటిపై ఎగరవేసిన సంగతి తెలిసిందే. పాక్ లో ఇండియా ఫ్లాగ్ ఎగరవేయడంతో దేశద్రోహం కేసు కింద ఉమెర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అతనికి ఆరు సంవత్సరాల కారాగార శిక్షను విధించింది కోర్ట్.

అయితే, తాను కోహ్లి వీరాభిమాని గానే జెండా ఎగరవేశానని జెండా ఎగరవేయడం తప్పని తనకు తెలియదని ఉమెర్ కోర్టులో పేర్కొన్న తన మాటను వినలేదు. ఇక ఈ నెల 18 వ తేదీన ఉమెర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, శనివారం (27/02/16) రోజున 50వేల రూపాయల పూచీకత్తుతో ఉమెర్ కు బెయిల్ మంజూరు చేసింది.