బిగ్ న్యూస్: ఎల్ జీ పాలిమర్స్ ఘటన లో 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Tuesday, July 7th, 2020, 11:11:05 PM IST


విశాఖపట్టణం లో మే 7 న ఎల్ జీ పాలిమర్స్ సంస్థ నుండి విష వాయువు విడుదల కారణం గా పరిసర ప్రాంతాల్లో 14 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు నెలల తరువాత ఈ ఘటన కి కారణమైన 12 మందిని విశాఖ పోలీసులు నేడు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సంస్థకు చెందిన సీఈఓ, ఇద్దరు డైరెక్టర్ లతో సహా 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.

విశాఖ లోని వెంకటాపురం లో జరిగిన ఈ ఘటన పై మే 7 న వరుస ఫిర్యాదులు నమోదు కాగా, నేడు అరెస్ట్ చేశారు. అయితే నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ అరెస్ట జరిగినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ కి నివేదిక అందించిన ఒక్క రోజులో నే పోలీసులు చర్యలు తీసుకోవడం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంస్థకు సంబంధించిన12 మందిని అరెస్ట్ చేసిన విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.