జంతువుల ద్వారా కరోనా సొకదు…రెండవ దశ అనివార్యమైంది అందుకే – వీకే పాల్

Thursday, May 6th, 2021, 12:23:21 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. అయితే లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటం తో దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లోని సింహాలకు కరోనా వైరస్ లక్షణాలు ఉండటం తో నిర్దారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే 8 సింహాలకు పాజిటివ్ అని తేలడం తో అంతా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదే కాక జంతువుల నుండి వైరస్ సోకుతుంది అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ సభ్యుడు అయిన వీ కే పాల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కరోనా వైరస్ మనుషుల నుండి మనుషుల కే సోకుతుంది తప్ప, జంతువుల నుండి సొకదు అంటూ వీ కే పాల్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వైరస్ మహమ్మారి తొలిసారి విజృంభించిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రజల్లో రోగ నిరోధక శక్తి తక్కువ కావడం వల్లే మహమ్మారి రెండవ దశ అనివార్యమైంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాక్సిన్లు వేయించుకున్న వారందరిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి ప్రభావాలు కనిపించవు అని అన్నారు. టీకా వేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రభావాలు లేకపోతే సాధారణం గానే పనులు చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం, ఇళ్లకే పరిమితం కావడం వంటి జాగ్రత్త చర్యలను అందరూ పాటించాలి అని, కరోనా పై పోరాటం కొనసాగిస్తున్న వారికి వైద్య సమాజం అండగా ఉండాలని అన్నారు.