ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం: వెంకయ్య

Tuesday, February 10th, 2015, 12:57:43 PM IST


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల నేపధ్యంగా ప్రజల తీర్పు గౌరవిస్తున్నామని తెలిపారు. అలాగే ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తామని వెంకయ్య ప్రకటించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ ఫలితాలు కేంద్ర ప్రభుత్వం పాలనపై ప్రజాభిప్రాయం కాదని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీలో కొత్తగా కొలువుదీరుతున్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని వెంకయ్య వివరించారు. కాగా సంచలన మెజారిటీతో దూసుకుపోతున్న ఆప్ పార్టీ విజయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ప్రతిపక్ష పార్టీలు ఓటమిని ఒప్పుకుంటున్నాయి.