ప్రతిపక్షాలు అవకాశం దొరికిందోచ్ .. బాబుకు కష్టాలు మొదలయ్యినట్టే..!

Wednesday, May 4th, 2016, 06:46:30 PM IST


ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలకు చక్కని అవకాశం దొరికింది. ఇప్పటికే రాష్ట్రాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఎన్నో సమస్యలు రాష్ట్రాన్ని వేదిస్తున్నాయి. రైతుల సమస్యల దగ్గరి నుంచి పిల్లల చదువుల వరకు అన్ని సమస్యలే. ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి.. ఎలా ఈ సమస్యల నుంచి బయట పడాలి అని చూస్తున్న తరుణంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం డంకా బజాయించి చెప్పింది.

దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిపోయింది. పైన ఉదహరించిన సమస్యల నుంచి బయట పడటం కంటే.. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాల సంధించే ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు కనిపిస్తున్నది.