చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నాడు.. ఎందుకో తెలుసా…?

Monday, April 11th, 2016, 04:18:16 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో మంచి హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నా.. కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నా.. చంద్రబాబు మాత్రం ఓ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడ తెలుగుదేశం పార్టీనుంచి చాలా మంది నేతలు జంప్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలకు అక్కడ పదవులు దక్కుతున్నాయి. ఈ ఉద్దేశ్యంతో చాలా మంది పార్టీమారుతున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంచుమించు ఇలాగే జరుగుతున్నది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో.. వైకాపా, కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇలా వరసగా కాంగ్రెస్, వైకాపా నుంచి నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతుండటంతో చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఉన్నారట. వైకాపా నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రు ఈరోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరికొంత మంది నేతలు తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నారని సమాచారం.