సినిమా విడుదలకు ముందే ఆ హీరో చుక్కలు చూపిస్తున్నాడా..?

Tuesday, February 16th, 2016, 04:27:27 PM IST


కమెడియన్ గా సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత కాలంలో హీరోగా మారి మొదటి సినిమాతో పరవాలేదనిపించుకున్నాక, ఇండస్ట్రీలో కమెడియన్ గా సెటిల్ కావాలా హీరోగా స్థిరపడాల అనే సందిగ్దంలో ఉండగా ఓ స్టార్ దర్శకుడితో హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది. స్టార్ దర్శకుడు తీసిన సినిమా కాబట్టి అది హిట్ అయింది. ఆ తరువాత మరో రెండు చిత్రాలలో హీరోగా నటించినా అవి పెద్దగా ఆడలేదు. ఇకపోతే, తాజాగా తెలుగు సిని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థలో కమెడియన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది. సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను పబ్లిసిటీ చేయడం మరోఎత్తు.

ఎంత పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమా అయిన పబ్లిసిటీ చేయాలి. అలా పబ్లిసిటీ చేస్తేనే ప్రజలలోకి వెళ్తుంది. కాని, ఈ కమెడియన్ హీరో మాత్రం పబ్లిసిటీకి పెద్దగా సహకరించడంలేదట. ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం గంటలు గంటలు వెయిటింగ్ చేయిస్తున్నాడట. సినిమాపై నమ్మకం ఉంటే ఉండొచ్చు.. కాని, ఇలా ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళని గంటల తరబడి వెయిటింగ్ చేయిస్తే.. అది ఆ సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ అవుతుంది కాని, పోజిటివ్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అని కొందరి వాదన. సినిమాను పబ్లిసిటీ చేసుకోవలసిన సమయంలో ఆ హీరో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎంత పెద్ద హీరో అయిన, సినిమాపై పూర్తినమ్మకమున్నా.. తన సినిమాను ఎలాగైనా పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తారు. కాని, ఈ కమెడియన్ హీరో ఎందుకని దానికి వ్యక్తిరేకంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధంకాని ప్రశ్న. ఇలాగైతే… ఈ సినిమా ఎలా హిట్ అవుతుంది.. ఇండస్ట్రీలో మరో అవకాశం ఎలా వస్తుంది చెప్పండి.