అమరావతిలోనే డిక్టేటర్ ఆడియో.. కారణం అదేనట..!!

Friday, December 18th, 2015, 11:52:24 AM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న 99 వ చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను అమరావతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 20 వ తేదిన.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరాతిలో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బాలయ్య సరసన ముగ్గురు భామలు రొమాన్స్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నది.

ఇకపొతే, ఈ సినిమా ఆడియోను అమరావతిలోనే ఎందుకు నిర్వహించాలి అనుకున్నట్టు. హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించడంలేదు అనే దానిపై అనేకమంది అనేక వివరణలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ వైపు నుంచి కూడా దీనికి వివరణలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి పేరును ప్రతిపాదించడం.. అమరావతి నగర నిర్మాణానికి ప్రధాని మోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరగటంతో పాటు.. జాతీయ అంతర్జాతీయ మీడియాను ఆకర్షించింది. ఇక, ఇప్పుడు అమరావతివైపు మరింత దృష్టి సారించాలి అంటే.. అమరావతి పేరు నిత్యం వార్తల్లో ఉండాలి. అలా ఉండాలి అంటే.. అక్కడ సినిమా షూటింగ్ లు కాని, సినిమా ఫంక్షన్లు కాని నిర్వహించాలి.

సినిమా ఫంక్షన్లు ఎందుకు నిర్వహించాలి అంటే.. ప్రజలను ఎక్కువగా ఆకర్షించే రంగం సినిమా రంగం. సినిమా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంది.. అక్కడ తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో డిక్టేటర్ ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని బాలయ్య అండ్ కో భావిస్తున్నారు. ఇక, బాలకృష్ణ కేవలం నటుడే కాకుండా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కావడంతో.. ఆయనపై అమరావతి నగర అభివృద్ధి భాద్యత కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.