విపణిలోకి విండోస్ 10

Wednesday, October 1st, 2014, 03:25:05 PM IST


మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను విడుదల చేసింది. విండోస్ 8 అంతగా ఆదరణ పొందని విషయం తెలిసిందే.. కాగ, విండోస్ 8 ప్రజాదరణ పొందకపోవడంతో.. మైక్రోసాఫ్ట్ విండోస్ 9ను విడుదల చేస్తుందని అందరు భావించారు. కాని, విండోస్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. విండోస్ 10ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కంప్యూటర్స్, ట్యాబ్లేట్స్ మరియు ఫోన్స్ అన్నింటికీ ఉపయోగపడుతుందని.. మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. విండోస్ 10 అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టం అని, గతంలో తలెత్తిన సమస్యలు ఈ విండోస్ 10లో ఉండవని..మైక్రోసాఫ్ట్ నిపుణులు అంటున్నారు.