అందంగా ఉన్న ఆ అమ్మాయి మనసు అంత కఠినమా..!

Thursday, January 21st, 2016, 04:18:53 PM IST


అందం అమ్మాయిల సొంతం. అందమైన అమ్మాయిల మనసు సున్నితంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కాని, కొంతమంది అమ్మాయిల మనసు కఠినంగా ఉంటుంది. అలా కఠినంగా ఉన్న అమ్మాయిలు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్దంగా ఉంటారట. ఇది నిజం. అదెలాగో ఈ సంఘటన చూస్తేనే అర్ధం అవుతుంది. ఇటీవల చైనాలోని సిచూవాన్ ప్రావిన్స్ లోని చెంగూ స్టేషన్లో ఓ 20 సంవత్సరాల యువతి తనతో పాటు ఓ బాతును తీసుకొని ట్రైన్ లోకి ఎక్కింది. అయితే, ట్రైన్ అధికారి.. బాతును తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. అంతే.. ఆ యువతి పక్కనే ఉన్న మరో మహిళ వద్ద నుంచి కూరగాయలు కట్ చేసే కత్తిని తీసుకొని ట్రైన్ లోనే ఓ మూలకు వెళ్లి కింద పేపర్ వేసి దాని మెడను కోసేసింది.
అయితే, ఆ తంతంగాన్ని అక్కడే ఉన్న వాంగ్ అనే వ్యక్తి ఫోటోలు తీశాడు. అనంతరం ఆ అమ్మాయిని ఇలా చేయడం తప్పుకాదా అని ప్రశ్నిస్తే.. బతికున్న బాతును తీసుకెళ్లదానికి అధికారులు అంగీకరించలేదని.. అందుకే దాన్ని చంపి తీసుకెళ్తున్నానని చెప్పిందట. ఈ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై పెటా సంస్థ మండిపడుతున్నది. అంతేకాకుండా.. ఆ అమ్మాయి ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.