జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు అవి పరాకాష్ట – యనమల రామకృష్ణుడు

Friday, April 9th, 2021, 11:57:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా తీయించిన సీఎం గా జగన్ రికార్డు ల కెక్కారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి పై శ్వేత పత్రం విడుదల చేయాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యనమల రామకృష్ణుడు. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పై కేంద్రం లేఖ జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇక పై కనిష్ట, గరిష్ట చెల్లింపుల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్తితి పెనం మీద నుండి పోయిలోకి నెట్టినట్లు అయ్యింది అంటూ సెటైర్స్ వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న 49,280 వేల కోట్ల రూపాయల మూల ధన వ్యయం, రాష్ట్రం చేసిన 19 వేల కోట్ల రూపాయల మూల ధన వ్యయం ఎక్కడా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధించారు. అయితే హద్దుపద్దు లేని రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, జీఎస్డీపీ అప్పుల నిష్పత్తి శాతం లెక్కల తో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గుండుసున్నా, పేదల ప్రజల సంక్షేమానికి పంగనామాలు పెడుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.