గవర్నర్ ను యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు

Saturday, August 1st, 2020, 12:00:38 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. టీడీపీ నేతలు ఈ విషయం పై ఘాటు విమర్శలు చేస్తుండగా, వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ గవర్నర్ నిర్ణయం ను స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా యనమల చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేత, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో రెండు సార్లు ఏదైనా బిల్లు ఆమోదం పొందితే, నిబంధనల ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారు అనేది సత్యం అని అన్నారు.

అయితే యనమల రామకృష్ణుడు గవర్నర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు. బిల్లులను రాష్ట్రపతి కి పంపించమని లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక యనమల ఏమైనా గవర్నర్ కి సలహాదారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఇపుడు ఈ వ్యవహారం పై టీడీపీ మరింత ఎక్కువగా విమర్శలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.