పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కి లేదు

Monday, April 5th, 2021, 01:25:46 PM IST

పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పులివెందుల మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గోపీనాథ్ కి ఫిర్యాదు చేశారు. అయితే పులివెందుల అంటేనే ప్రేమ, అభిమానం, పౌరుషాలకు పుట్టినిల్లు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మన రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలు అందించారు అని వ్యాఖ్యానించారు. అయితే తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ కి పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేయడం పట్ల సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.