పచ్చి ద్రోహం చేసినవారికే ఓట్లు ఎందుకు వేయాలి – ఎమ్మెల్యే భూమన కరుణాకర్

Tuesday, April 6th, 2021, 01:37:20 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అటు అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతి పక్ష పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ మేరకు ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా రేణిగుంట నుండి శ్రీకాళహస్తి వరకూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.అయితే ఈ ర్యాలీ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి గురుమూర్తి సైతం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వెంకన్న పాదాల సాక్షిగా మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు అని, పచ్చిద్రోహం చేసిన వారికే ఎందుకు ఓట్లు వేయాలి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రత్న ప్రభ ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజు కి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం అని అనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పెట్రల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ లు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఓటమి భయం తో ఎన్నికలు నిలిపి వేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి భూమన చేసిన వ్యాఖ్యల కి గానూ టీడీపీ, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.