రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేశ్ లకు లేదు – వైసీపీ ఎమ్మెల్యే

Friday, April 23rd, 2021, 06:42:49 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో డెయిరీ లను నిర్వీర్యం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కోపరేటివ్ డెయిరీ లను టీడీపీ నాయకులు దోచుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ హయాంలో రైతులు ఏం చేశారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే రైతుల గురించి చంద్రబాబు, లోకేష్ లకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. అయితే ప్రైవేట్ డెయిరీ లను టీడీపీ నేతలు సొంత ఆస్తుల్లా భావించారు అని ఆరోపించారు.

అయితే సంగం డెయిరీ లో మోసాలకు పాల్పడి అరెస్ట్ అయిన వ్యక్తికి వత్తాసు పలుకుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సంగం డెయిరీ లో దొంగ సర్టిఫికెట్ల తో 70 ఎకరాలకు పైగా దోచుకున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి దోపిడీ చేశారు అని తెలిపారు. అయితే దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ హయాంలో రైతులను నిలువునా మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చారు.