జన సేన పార్టీ కి చెందిన కార్యకర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలను కోల్పోవడం పట్ల పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిద్దలూరు ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు గిద్దలూరు ఎమ్మెల్యే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జన సేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే జన సేన పార్టీ కి చెందిన కార్యకర్త ఆత్మహత్య కి తానే కారణం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. జన సేన కార్యకర్త వ్యక్తి గత సమస్యలతో ఆత్మ హత్య చేసుకున్నాడు అని, కానీ నా వలన, నా కార్యకర్తల వలన అంటూ జన సేన పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.అయితే తపంచాలు, నాటు బాంబులతో తిరిగిన వ్యక్తి తో నా కార్యకర్తలకు ఏం సంబంధం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం లో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దం అని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ అలా ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ తో గెలిచిన నేను, మళ్ళీ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవగలను అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ దమ్ము ధైర్యం ఉంటే ప్రజా తీర్పు కొరగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆయన గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను, పవన్ పార్టీ మూసుకొని వెళ్ళిపోతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.