చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్ ను లాభాల్లోకి తెచ్చుకొన్నారు – వైసీపీ ఎమ్మెల్యే

Thursday, May 6th, 2021, 08:52:42 AM IST

YSRCP_party

తెలుగు దేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య మండిపడ్డారు. రైతుల కష్టార్జితం అయిన సంఘం డెయిరీ ను నరేంద్ర తన సొంత ఆస్తిగా మలుచుకున్నారు అని అన్నారు. రైతులకు దక్కాల్సిన లాభాలను తన జేబుల్లో నింపుకున్నాడు అని అన్నారు. అయితే దోపిడీ దారుడును అరెస్ట్ చేస్తే టీడీపీ రాజకీయం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం డెయిరీ ను అమూల్ కి కట్టబెడుతున్నారు అంటూ ఆరోపించే తెలుగు దేశం పార్టీ నేతలు, ధూళిపాళ్ల నరేంద్ర చేసిన మోసం ఏంటో ప్రజలకు చెప్పక పోవడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. అయితే 1977 లో రైతుల కృషితో రూపు దిద్దుకున్న సంఘం డెయిరీ ను ధూళిపాళ్ల దొడ్డిదారిన హస్తగతం చేసుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే సహకార చట్టం ప్రకారం రెండేళ్లు డెయిరీ కి పాలు పోస్తేనే డైరెక్టర్ గా ఎన్నికయ్యే అర్హత ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇవేమీ లేకుండా నరేంద్ర చైర్మన్ అయ్యారు అంటూ వెల్లడించారు. అదే తరహా లో సహకార డెయిరీ ను సొంత వ్యాపార సంస్థ గా మార్చారు అంటూ మండిపడ్డారు. అసలు సహకార డెయిరీ లను నిర్వీర్యం చేసింది టీడీపీ కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చిత్తూరు డెయిరీ ను మూసేసి హెరిటేజ్ లాభాల్లోకి తెచ్చుకొన్నారు అని, చంద్రబాబు నాయుడు దీని వలన వేల కోట్ల రూపాయలను సంపాదించారు అంటూ చెప్పుకొచ్చారు.