చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకలేకపోయారు – ఎమ్మెల్యే జోగి రమేష్

Tuesday, March 9th, 2021, 07:30:35 AM IST

మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు ఇద్దరూ కూడా అసభ్యంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల పైనా, సీఎం జగన్ పైనా నోరు పారేసుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇద్దరూ సభ్యత గా నడుచుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే స్థానిక ఎదురవుతున్న ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు, లోకేష్ మతి స్థిమితం కోల్పోయారు అని విమర్శలు గుప్పించారు.

ఈ రాష్ట్రానికి తండ్రి కొడుకులు విష పురుగుల్లా తయారు అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో ఇద్దరూ ఏపీ వదిలి పారిపోయారు అని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దేశం వదిలిపోయే పరిస్థితి వారికి వస్తుంది అని సెటైర్స్ వేశారు. అయితే 2019 ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా వారి బుద్ది మారలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీఎం ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఏం పీకుతావ్ అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా ఎంత దిగజారి పోయారో వారి మాటలను బట్టే అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకలేకపొయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే గత ఎన్నికల్లో వారిని ప్రజలు కలుపు మొక్కల్లా పీకేశారు అంటూ చెప్పుకొచ్చారు.