పక్కింటి బాత్రూం లో రహస్య కెమెరా పెట్టిన యువకుడు అరెస్ట్!

Friday, March 2nd, 2018, 04:48:20 PM IST


నేటి నాగరిక ప్రపంచంలో మనిషి రకరకాల నూతన పోకడలు, ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ మహిళలపట్ల వివక్ష, వారిపై లైంగిన దాడులు చేయాలనే ఆలోచన మాత్రం తగ్గడం లేదు. సభ్యసమాజం తలదించుకునేలా వికృత చేష్టలకు పాల్పడిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు బనశంకరి ప్రాంతంలోని మైకో లేఔట్ సార్వభౌమనగర్ లో ఉంటున్న జీవన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

తన పక్కింటివారి ఇంట్లో ఏమిజరుగుతుందో తెలుసుకోవాలనే తప్పుడు ఆలోచనతో వారి ఇంటి బాత్రూం రహస్య కెమెరాను అమర్చాడు. ఈ నేపథ్యంలో, బాత్ రూమ్ కు వెళ్లిన పక్కింటి మహిళ అక్కడ కెమెరా ఉన్నట్టు గుర్తించి, ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో, ఆయన పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ పనికి పాల్పడింది ఎవరు అని దానిపై విచారణ చేపట్టి చివరికి ఆ పని చేసింది జీవన్ అని గుర్తించి, అతడిని కటకటాల వెనక్కి పంపారు….