వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లాన్ ను అమలుచేయనున్న జగన్

Tuesday, April 19th, 2016, 03:32:42 PM IST


2014 ఎన్నికల తరువాత బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వైసీపీని చూసి జనాలు ఆహా.. ఇక టీడీపీ పని అయిపోయినట్లే. జగన్ ప్రభుత్వం చేత పరిగెత్తి పని చేయిస్తారు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వైసీపీ మాత్రం నానాటికీ కుంగిపోతూ వస్తోంది. బలమైన నేతలు, ఒక ప్రతిపక్ష పార్టీకి కావలసిన సరిపడా సీట్లు ఉన్నప్పటికీ జగన్ మాత్రం అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేకపోయారనే చెప్పాలి. పైగా కీలక నేతలంతా పార్టీని వీడి వలసలు పోతున్నారు.

దీంతో జగన్ ఎలాగైనా ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడాలనే ఉద్దేశ్యంతో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఫార్ములాను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో వైఎస్ చేసిన ఆ పాదయాత్ర ఓ సంచలనం. ఎంత సంచలనమంటే ఆ పాదయాత్రతో వైఎస్ టీడీపీని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగన్ కు కూడా తన తండ్రిలాగే రోడ్డెక్కి పాదయాత్ర చేసి ప్రజల్లో నమ్మకాన్ని, సొంత నాయకుల్లో మనో బలాన్ని నింపాలని చూస్తున్నారు. గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రలు ఆయనకు కాస్త ప్రయోజనాన్ని చేకూర్చాయి కూడా.