బిగ్ షాక్: వైసీపీకి గుడ్‌బై చెప్పిన కీలక నేత.. కారణం అదేనా?

Saturday, April 3rd, 2021, 02:09:01 AM IST


ఏపీ అధికార పార్టీ వైసీపీకి తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఓ షాక్ తగిలింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత కనుమూరి హరిశ్చంద్రరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు ఇకపై రాజకీయాలకు కూడా తాను దూరంగా ఉంటానని, హరిశ్చంద్రరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. అయితే పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తనకు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే రాజకీయాల్లోకి తాను పొరపాటున వచ్చానని, రాజకీయాలకు తాను కరెక్ట్ కాదని హరిశ్చంద్రరెడ్డి అన్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న తనపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు హరిశ్చంద్రరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌తో విభేదాల కారణంగానే హరిశ్చంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే వరప్రసాద్ అభివృద్ధి పేరుతో నాయకులు, ప్రముఖల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని హరిశ్చంద్రారెడ్డి అన్నారు.